నెగెటివ్ కామెంట్స్,నిరాశ పరిచే ప్రీ రిలీజ్ బిజినెస్, అసలు ఇప్పుడు రాజశేఖర్ కు పెద్దగా మార్కెట్ లేదు. తను ఇతర వేషాలకు మారిపోక తప్పదని రాజశేఖర్ కూడా దాదాపుగా ఫిక్స్ అయిపోయి ఆఖరికి విలన్ గా కూడా చేస్తానని సిద్దమైనన పరిస్థితులలో వచ్చిన మూవీ గరుడవేగ.
ఈ నేపథ్యంలో విడుదలైన గరుడవేగ ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్‌తో ప్రేక్షకుల మనసుదోచుకుంది. ఎంతో కాలంగా బాక్సాఫీస్ విజయం కోసం ఆవురావురుమంటూ ఎదురు చూసిన రాజశేఖర్ గరుడవేగతో తిరిగిఫాంలోకి వచ్చారు. విడుదలైన ప్రతి సెంటర్‌లోనూ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఓవర్సిస్‌లోనూ మంచి వసూళ్లను రాబడుతు రాజశేఖర్‌కి మంచి హిట్ ఇచ్చింది.
ఫస్ట్ వీక్ రన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న గరుడవేగ వసూళ్లలోనూ అంతేవేగంతో దూసుకుపోతోంది. తొలి ఐదురోజుల్లో ఈ సినిమా రూ. 15 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాత కోటేశ్వరరాజు ప్రకటించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ నిర్మాతగా తన కెరీర్‌లో తొలి చిత్రం అని తెలిపారు. తొలి చిత్రంతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు మౌత్ పబ్లిసిటీ ఓ ప్లస్ పాయింట్ అయింది. డా రాజశేఖర్‌కి చాలాకాలం తర్వాత సంతృప్తిని ఇచ్చిన సినిమా కూడా ఇదే. దాదాపు దశాబ్ధ కాలం తర్వాత మళ్లీ రాజశేఖర్‌కి మర్చిపోలేని సక్సెస్‌ని అందించింది గరుడ వేగ.