సినీనటుడు కమల హాసన్లాంటి వారిని కాల్చి చంపేయాలని, లేకపోతే ఉరి తీయాలని అఖిల ఉత్తరప్రదేశ్లోని భారత హిందూ మహాసభ ముఖ్యనేత అశోక్ శర్మ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హిందువులని ఉగ్రవాదులంటూ వ్యాఖ్యలు చేస్తోన్న వారు ఎవరైనా సరే వారిని క్షమించకూడదని వ్యాఖ్యానించారు. కమల హాసన్ చేసిన వ్యాఖ్యలపై హిందువులే కాదు పలువురు ముస్లిం నేతలు కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కమల్ పై క్రిమినల్, పరువునష్టం కేసు పెట్టాలన్న పిటిషన్ ను వారణాసి కోర్టు విచారణకు కూడా స్వీకరించింది.
ఈ క్రమంలో కమల్ కు ప్రముఖ సినీ నటుడు అరవిందస్వామి మద్దతుగా నిలిచారు. చట్ట విరుద్ధంగా బెదిరింపులకు, హింసకు పాల్పడేవారిని ఉగ్రవాదులు కాక మరేమని పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. ‘మెర్సల్’ సినిమాకు కూడా మద్దతు పలికారు. ఓ తమిళ మేగజీన్ కు రాసిన కాలమ్ లో ఆయన ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.