పవన్‌ ఫ్యాన్స్‌కు త్రివిక్రమ్ గిఫ్ట్‌..

211
Pawan's new song on Trivikram's birthday
- Advertisement -

పవన్- త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబోలో ‘అజ్ఞాతవాసి’ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ 25 వ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. జల్సా అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న చిత్రంపై ప్రేక్షకులతోపాటు పవన్ అభిమానులకు భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ అనిరుధ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ బిట్ వీడియో హీరోయిన్ కీర్తి సురేశ్ -పవన్ ల లుక్స్ ఈ సినిమా పై అంచనాలను మరింత పెంచాయి. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ విడుదల చేస్తారని అభిమానులు ఆశించి భంగపడ్డారు.

Pawan's new song on Trivikram's birthday

అయితే ఈ నెల 7న త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఓ పాటను విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని హారిక హాసిని క్రియేషన్స్ వారు తెలిపారు. ఇప్పటివరకు ఈ సినిమాకు అఫీషియల్ టైటిల్ ను అనౌన్స్ చేయలేదు. త్రివిక్రమ్ బర్త్ డే రోజున ఈ సినిమా టైటిల్ ను కూడా ప్రకటించబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దాదాపుగా ‘అజ్ఞాతవాసి’ అనే టైటిల్ ఫిక్స్ అయిందట. ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జవవరి 9న సెకండ్ షోతో ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -