డా. రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన మూవీ ‘పి.ఎస్.వి. గరుడవేగ’ ఈ చిత్ర బృందానికి దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి శుభాకాంక్షలు చెప్పారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్ర శుక్రవారం విడుదలైన మంచి టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా రాజమౌళి ట్వీట్ చేశారు. యూనిట్ సభ్యులకు అభినందనలుచెప్పారు. సినిమా సానుకూలమైన స్పందన పొందిందని పేర్కొన్నారు. ఆదివారం షోకు టికెట్లు బుక్ చేసుకున్నట్లు తెలిపారు. దీనికి రాజశేఖర్ స్పందించారు. ‘ధన్యవాదాలు సర్. మీ మాటలు మాకు చాలా బలాన్ని ఇచ్చాయి’ అని ట్వీట్ చేశారు.
పూజా కుమార్, శ్రద్ధాదాస్, కిశోర్, నాజర్, పోసాని కృష్ణమురళి ‘పి.ఎస్.వి. గరుడవేగ 126.18 ఎమ్’లో ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్ నటి సన్నీలియోని ప్రత్యేక గీతంలో ఆడిపాడారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు అందించారు. ఎం. కోటేశ్వర్ రాజు నిర్మాత. ‘బాహుబలి 2’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రాజమౌళి తన కొత్త సినిమాకు సిద్ధమౌతున్నారు. సోషల్ డ్రామాగా తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇంకా ఇందులో నటీనటుల వివరాలను ప్రకటించలేదు. 2019లో మహేశ్-రాజమౌళి కాంబినేషన్లో ఓ చిత్రం పట్టాలెక్కే సూచనలు ఉన్నాయి.