త్వరలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన విలక్షణ నటుడు కమల్ హాసన్ రోజుకో వార్తతో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. దేశంలో హిందూ తీవ్రవాదం లేదని చెప్పలేదని కమల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో పెనుప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సత్యమేవ జయతే నినాదంపై హిందువులు విశ్వాసాన్ని కోల్పోతున్నారని, దానికి బదులు శక్తిసంపన్నులుగా ఉండటమే సరైనదని భావిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో కమల్ వ్యాఖ్యలు వివాదానికి దారితీయగా బీజేపీ నేతలు ఆయనపై మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో కమల్‌కు బాసటగా నిలిచారు ప్రకాశ్ రాజ్. జాతి, మతం, నైతికత పేరుతో భయపెడితే తీవ్రవాదం కాదు. మరి దాన్ని ఏమంటారు?.. కేవలం అడుగుతున్నాను’ అని ట్విట్టర్లో ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. నైతికత పేరుతో నా దేశంలోని ఓ జంటను వేధించి, శారీరకంగా చిత్రహింసకు గురి చేయడం తీవ్రవాదం కాదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని గోవధ చేశారనే చిన్న అనుమానంతో శిక్షించడం తీవ్రవాదం కాదా అని ప్రశ్నించారు.
భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరిచినంత మాత్రాన వారిని విమర్శించడం, తిట్టిపోయడం తీవ్రవాదం కాదు.. మరి తీవ్రవాదం అంటే ఏంటి అని ప్రకాష్‌రాజ్ ఓ పోస్ట్ చేశారు. దీంతోపాటు ‘జస్ట్‌ఆస్కింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజకీయ పార్టీ పెట్టేందుకు కమల్ సిద్ధమవుతున్న తరుణంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
If instilling fear in the name of religion..culture..morality is not terrorizing..than what is it ..#justasking pic.twitter.com/hs8Y3H700L
— Prakash Raj (@prakashraaj) November 3, 2017