ప్రస్తుతం శివ కార్తికేయన్ తో కలిసి వేలైక్కారన్ మూవీ చేస్తోంది నయనతార. కొన్ని వారాల క్రితం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి మంచి రెన్పాన్స్ రాగా.. ఇప్పుడీ మూవీలోంచి నయన్ కు చెందిన ఓ సూపర్బ్ స్టిల్ ను రిలీజ్ చేశారు.
ఈ వైట్ డ్రెస్ లో నయనతార తెగ మెరిసిపోతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన వైట్ డ్రెస్ లుక్ అదిరిపోయేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ కూడా అమ్మడి డ్రెస్ కి మ్యాచింగ్ గా ఉండడంతో.. ఫోటోకు మరింతగా అందం వచ్చేసింది. 32 ఏళ్ల వయసులోనూ టీనేజ్ బ్యూటీలను సవాల్ చేసే అందాన్ని చూపించేస్తోంది నయన్.
ఇక ఈ వేలైక్కారన్ మూవీలో కూడా నయన్ కేరక్టర్ చాలా ఆసక్తిగా ఉంటుందని చెబుతున్నారు. అయితే..ఇక్కడ గమనించాల్సింది… నయన చేతిపై కనిపిస్తున్న టాటూను. PD అనే ఇంగ్లీష్ లెటర్స్ స్పష్టంగానే కనిపిస్తున్నాయి. అంటే అర్ధం డీటైల్డ్ గా చెప్పాల్సిన పని లేదు Prabhu Deva అని. ఈ అమ్మడు ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నప్పుడు. తమ ప్రేమకు జ్ఞాపకంగా తన చేతిపై ప్రభుదేవా పచ్చబొట్టు పొడిపించుకుంది. ఆ తర్వాత ప్రభుదేవాతో కటీఫ్ అయిపోయింది.
అయితే ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయన్ ప్రేమలో ఉందని టాక్. అఫ్ కోర్స్.. పెళ్లి కూడా అయిపోయిందనే టాక్ ఉంది. ఇప్పటికే వేలైక్కారన్ సినిమా ఫస్ట్, సెకండ్ లుక్ కు మంచి స్పందన రావడంతో కచ్చితంగా సినిమా సూపర్ హిట్ అవుతోందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా మీద రోజురోజుకూ అంచనాలు పేరిగిపోతున్నాయి.
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తని ఒరువన్’ సినిమాకు దర్శకత్వం వహించిన మోహన్ రాజా అలియాస్ రాజా వేలైక్కారన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు రాజా ఊహించని స్థాయిలో సినిమాను తెరకెక్కించారని చిత్ర బృందం అంటోంది.