యంగ్‌ టైగర్‌ డిఫెరెంట్‌ లుక్..

187
- Advertisement -

‘టెంపర్‌’ నుంచి డిఫెరెంట్‌ లుక్స్‌తో కనిపిస్తున్నాడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. ఆ లుక్స్‌కి ఫ్యాన్స్‌ కూడా తెగ ఫాలో అవుతున్నారు. అయితే ఇదే ట్రెండ్‌ ని ఎన్టీఆర్‌ కంటిన్యూ చేస్తూ..కాస్త కొత్త లుక్‌ లో కనిపించనున్నాడు యంగ్‌ టైగర్‌.

ఇదిలా ఉంటే..ఎన్టీఆర్ నెక్ట్స్‌ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉందనే సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ‘నాన్నకు ప్రేమతో’ .. ‘జనతా గ్యారేజ్’ .. ‘జై లవ కుశ’ సినిమాల్లో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తూ వచ్చాడు.

 ntr different look in trivikram movie

ఎక్కువగా ఆయన గెడ్డం పెంచేసి రఫ్ లుక్ తో ఆ సినిమాలు చేశాడు. కానీ త్రివిక్రమ్ సినిమాలో పూర్తిగా షేవ్ చేసుకుని క్లాస్ లుక్ తో కనిపించనున్నట్టు సమాచారం. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కనుక .. ఆ లుక్ తో ఉండాలని త్రివిక్రమ్ చెప్పారట. అందువలన ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి భిన్నంగా కనిపించనున్నాడని అంటున్నారు.

- Advertisement -