అనుపమ పరమేశ్వరన్… ఈ హీరోయిన్ పేరునే ఇప్పుడు టాలీవుడ్ జపం చేస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అ…ఆ చిత్రంలో కనిపించిన ఈ భామ జాతకం ఉన్నట్లుండి చటుక్కున మారిపోయింది. ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేస్తున్నాయి. అఆ, శతమానం భవతితో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ఉన్నది ఒకటే జిందగీతో హిట్ కొట్టింది.
వరుస విజయాలతో అదృష్టలక్ష్మీగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ సక్సెస్‌ని తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకి లభిస్తోన్న రెస్పాన్స్ పట్ల అనుపమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. అంతా తన పాత్రను గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే గర్వంగా అనిపిస్తోందని చెప్పింది.
ఇక ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరనే ప్రశ్నకు .. తోటి హీరోయిన్స్ అంతా తనతో ఫ్రెండ్లీగానే ఉంటారని అంది. హీరోల్లో బెస్ట్ ఫ్రెండ్ అంటే శర్వానంద్ అని స్పష్టం చేసింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘శతమానం భవతి’ వచ్చిన సంగతి తెలిసిందే. సాయిపల్లవి తరచూ తనతో మాట్లాడుతూ ఉంటుందని చెప్పింది. ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని జోడీగా నటిస్తోన్న అనుపమ, కరుణాకరన్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సరసన చేయనుంది.