ఏప్రిల్ 27న…నా పేరు సూర్య

191
Allu Arjun begins shooting for Naa Peru Surya
Allu Arjun begins shooting for Naa Peru Surya
- Advertisement -

వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకొని టాప్ ఫాంలో ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. టెంపర్, కిక్, రేసుగుర్రం వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించి వరస సక్సెస్ లు అందుకొని తొలిసారిగా మెగా ఫోన్ పడుతున్న వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పేరును “నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా”గా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీనికూడా ప్రకటించేసింది చిత్ర యూనిట్. వచ్చే ఏడాది 2018 ఏప్రిల్ 27న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారట.

పవర్‌ఫుల్‌ మిలటరీ అధికారిగా కనిపించబోతున్న అల్లు అర్జున్.. అందుకోసం అమెరికన్ ట్రైనర్‌ ఆధ్వర్యంలో కసరత్తులు చేస్తున్నాడట. అయితే ఇందులో సిక్స్‌ ప్యాక్‌ బాడీ ఏముండదట. పాత్రకు తగ్గట్టు ఫిట్‌గా ఉండడం కోసమే ఈ కసరత్తులు చేస్తున్నాడని తెలిసింది.ఆర్మీ అధికారిగా కనిపించనున్న అల్లు అర్జున్‌కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రఫర్ రాజీవ్ రవి కెమెరా వర్క్ అందిస్తున్న ఈ సినిమాకు విశాల్ – శేఖర్ సంగీతం సమకూర్చనున్నారు.

- Advertisement -