ఖడ్గం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే హీరోయిన్ కిమ్ శర్మ. ఇంతేకాదు.. బాలీవుడ్ లో కొన్ని హిట్ సినిమాలతో, యువరాజ్ సింగ్ మాజీ ప్రేయసిగా కూడా కిమ్ గుర్తుంటుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ అమ్మడు అంతగా వార్తల్లో లేదు.
కొన్నేళ్ల కిందట వివాహం చేసుకున్న కిమ్ ఇటీవలే భర్తను వదిలి ఇండియా వచ్చేసింది. అంతేగాక..మరో వ్యక్తితో సన్నిహితంగా తిరుగుతోందని బాలీవుడ్ లో టాక్.
అలీ పుంజానీ అనే వ్యాపారిని వివాహం చేసుకుంది కిమ్. అతడితో కలిసి కెన్యాలో కాపురం పెట్టిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఏమైందో ఏమో కానీ.. ఈమె అతడిని వదిలేసి మెన్స్ వేర్ డిజైనర్ అర్జున్ ఖన్నాతో కిమ్ సన్నిహితంగా మెలుగుతోందని సమాచారం. వీళ్లిద్దరూ కలిసి పలు బహిరంగ వేదికలపై జంటగా కనిపించారు.
అయితే..ఈ అర్జున్ ఖన్నా అనే వ్యక్తికి కూడా వివాహం అయ్యింది. విడాకులు ఏమీ తీసుకోలేదు. కానీ ఇతడు కిమ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. దీంతో వీరి రిలేషన్షిప్ మీద సోషల్ మీడియాలో జోరుగానే వార్తలొస్తున్నాయి.
ఇక ఇదిలా ఉంటే… కిమ్ కు బ్రేకప్ లు ఏమీ కొత్త కాదు. యువరాజ్ తో ఈమె బంధం చాన్నాళ్ల పాటు కొనసాగింది. ఆ తర్వాత ఒక స్పానిష్ బాయ్ ఫ్రెండ్ తో స్నేహం- ప్రేమ- ఎంగేజ్ మెంట్ వరకూ వెళ్లింది కథ. అతడితో బ్రేకప్ అనంతరం కెన్యన్ బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది. ఇప్పుడు అది కూడా ముగిసినట్టే అని టాక్!