గవర్నర్ నరసింహన్‌కు మాతృవియోగం..

209
Governor Narasimhan Mother Passed Away
- Advertisement -

తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ తల్లి కన్నుమూశారు. ఆయన తల్లి విజయలక్ష్మి శ్రీనివాసన్ (94) నిన్న రాత్రి నిద్రలోనే తుది శ్వాస విడిచారు. ఈ మేరకు రాజ్‌భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్ సందర్శించి గవర్నర్ తల్లి భౌతికకాయానికి పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సంతాపం ప్రకటించారు.

అనంతరం పలువురు అధికార అనధికార ప్రముఖులు రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌కు సానుభూతి తెలిపారు. విజయలక్ష్మి అంత్యక్రియలు నేడే హైదరాబాదులోని పంజాగుట్ట స్మశానవాటికలో జరుగనుంది. ఈ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి జగదీష్‌రెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మతో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు.

- Advertisement -