అలాంటోళ్ళను చెప్పుతో కొట్టాలే: కేసీఆర్‌

185
CM KCR assures to fulfill promises made to Singareni employees ...
- Advertisement -

ప్రగతిభవన్‌లో నేడు(ఆదివారం) సింగరేణి కార్మికులతో  సీఎం కేసీఆర్ ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..కార్మికులు గెలిచినప్పుడే నిజమైన గెలుపని అన్నారు. టీబీజీకేఎస్ గెలించింది 2012లో..ఆ తర్వాతనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిందని సీఎం కేసీఆర్ తెలిపారు. గతంలో కూడా టీబీజీకేఎస్‌ను గెలిపించారు. ఈ సారి గెలుపు సింగరేణి కార్మికుల గెలుపు కావాలన్నారు. సింగరేణి కార్మికులకు మంచి జరగాలని సీఎం ఆకాంక్షించారు.

ఇదే కార్యక్రమంలో..టీబీజీకేఎస్ గుర్తింపు సంఘానికి సభ్యత్వ రుసుము ఇక నుంచి ఒక్కరూపాయే ఇవ్వాలని సీఎం సూచించారు. క్వార్టర్ మారినా ,  జ్వరం వచ్చినా , కార్మికులు ఎందుకు లంచం ఇవ్వాలని సీఎం ప్రశ్నించారు.  అంతేకాకుండా రేపటి నుంచి లంచం అడిగినోన్ని..తీసుకున్నోన్ని చెప్పుతో కొట్టాలని సీఎం నిర్దేశించారు. సింగరేణి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వాటా నుంచి రూ.50 కోట్లు తగ్గించుకోనైనా, రూ.10 లక్షల రుణం ఇస్తమని సీఎం పునరుద్ఘాటించారు. కార్మికుల తల్లిదండ్రులకు కూడా రిఫరల్ హాస్పిటల్ కల్పిస్తామన్న కేసీఆర్, సింగరేణిలో పరిస్థితులను చక్కదిద్దాలన్నారు.

సింగరేణి లాభం రూ.750 నుంచి 800 కోట్లు వచ్చాయని,  కొత్త పే రివిజన్ ప్రకారం పెరిగిన వేతనాలు ఇవ్వడానికి రూ.375 కోట్లు పక్కనబెట్టినట్లు సీఎం వెల్లడించారు. సింగరేణి ఉద్యోగం అనుకున్నంత మంచిదికాదని, సింగరేణి కార్మికులు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తారన్నారు. ఇక  ఓపెన్‌కాస్ట్ గనుల్లో సీనియర్లకు అవకాశం కల్పిస్తమన్న సీఎం .. బయ్యారం ఉక్కుగనిని కూడా సింగరేణికే అప్పగిస్తామని స్పష్టం చేశారు.

- Advertisement -