కోర్టులో లొంగిపోయిన యువ హీరో

211
Court issues arrest warrant against actor Jai
- Advertisement -

జర్నీసినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో జై. అయితే రీసెంట్‌గా ఈ హీరో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డా విషయం తెలిసిందే. ఫుల్లుగా తాగేసి డ్రైవ్ చేస్తూ.. చెన్నైలో ఓ డివైడర్ ను ఢీ కొట్టడంతో.. ఇతడిపై పోలీసులు కేసు నమోదు చేసి.. కోర్టుకు లాగారు. బుధవారం నాడు కోర్టు హియరింగ్ ఉండగా.. ఆ రోజున కోర్టుకు వచ్చాడు జై. కానీ గురువారం కూడా రావాలని జడ్జ్ ఆదేశించగా.. ఆ ఆదేశాలను జై పట్టించుకోలేదు. దీంతో అతడిని తీసుకువచ్చి హాజరు పరచాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది.

Court issues arrest warrant against actor Jai

అయితే జై అందుబాటులో లేడని పోలీసులు కోర్టుకు తెలపడంతో.. మెట్రోపాలిటన్ కోర్టు జై పై నాన్ బెయిలబుల్ వారంట్ ఇష్యూ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా కోర్టుకు వచ్చిన జై.. తాను చేసిన నేరాన్ని అంగీకరించారు. దీంతో అతనికి రూ.5200 జరిమానా విధించటంతో పాటు.. ఆరు నెలల పాటు వాహనాన్ని డ్రైవ్ చేయకూడదన్న ఆదేశాల్ని జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో రానున్న ఆరునెలల పాటు జై.. వాహనం నడిపే అవకాశాన్ని కోల్పోయారు.

- Advertisement -