అనుష్క పేరు వెనుక అసలు కథ..

303
Real Fact about Anushka Shetty Name
- Advertisement -

అందాల నటి అనుష్క అసలు పేరు స్వీటీ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ముద్దుగుమ్మ పేరు అనుష్కగా ఎలా మారిందన్న విషయమై ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పింది. చిన్నతనంలో ముద్దుగా అమ్మానాన్నలు పెట్టుకున్న పేరు స్వీటీ. తన పేరు తనకు స్వీటీ అని పిన్నమ్మ పేరు పెట్టిందని, తల్లిదండ్రులు సాయి భక్తులు కావడంతో సాయి అన్న పేరు కలిసొచ్చేలా మరో పేరు పెట్టాలని వారు అనుకున్నా, అది వాయిదా పడుతూ వచ్చిందట. ఆపై స్కూల్లో కూడా స్వీటీ అనే పేరునే రాసి చేర్పించారని, అదే నాపేరని చెబితే, అందరూ నవ్వుతూ ఉండేవాళ్లని, దీంతో చాలా ఇబ్బంది పడ్డానని చెప్పుకొచ్చింది.

Anushka Shetty Revealed her name Secret

అయితే సినిమాల్లోకి వచ్చిన తరువాత, ‘సూపర్’ షూటింగ్ సెట్లో స్వీటీ… స్వీటీ అని సెట్లో పిలుస్తుంటే బాగాలేదని నాగార్జున, సోనూసూద్ లతో డిస్కస్ చేశానని, వారు పేరు మార్చుకోవాలని సూచించారని గుర్తు చేసుకుంది. ఇక తక్షణమే తండ్రికి ఫోన్ చేసి పేరు మార్చుకోవాలన్న కోరికను చెప్పి, మంచి పేరును సూచించమని చెప్పగా, “ఎవరికీ జీవితంలో తన పేరును తాను పెట్టుకునే అవకాశం రాదు.

కాని నీకు ఆ అవకాశం వచ్చింది. నీ పేరు నువ్వే పెట్టుకో పండగ చేస్కో.. అని చెప్పేశారని, ఆపై ఎన్నో వెబ్ సైట్లు, పిల్లల పుస్తకాల పేర్లు వెతికి, మూడు నెలల పాటు శ్రమించి అనుష్క అన్న పేరును కనిపెట్టి, సన్నిహితులకు కొత్త పేరు గురించిన సమాచారాన్ని ఇచ్చానని అనుష్క ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

- Advertisement -