పూరి జగన్నాథ్@50

215
Puri Jagannath
Puri Jagannath
- Advertisement -

వైవిధ్యం ప్రదర్శిస్తూ చిత్రాలను రూపొందించడంలో సిద్ధహస్తుడు పూరి జగన్నాథ్… తనదైన బాణీతో జనాన్ని ఆకట్టుకుంటున్న పూరి జగన్నాథ్ పుట్టినరోజు నేడు…

Puri Jagannath

పూరి జగన్నాథ్ అంటేనే వెరైటీ అనే పేరు సంపాదించారు… తొలిసినిమా ‘బద్రి’ మొదలు మొన్నటి ‘జ్యోతిలక్ష్మి’ వరకు పూరి తీరు అలాగే సాగింది…నువ్వు నంద అయితే నేను బద్రి,.. బద్రినాథ్ అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ మన చెవుల్లో మారు మోగుతూనే ఉంటుంది.

Puri Jagannadh

బద్రి సినిమాలో పవర్ స్టార్ ను కొత్తగా చూపించిన పూరి కమర్షియల్ ఎంటర్ టైనర్ లకు డిఫరెంట్ అర్థం చెప్పిన దర్శకుడు. కమీషనర్ కూతుళ్లు పెళ్లి చేసుకోరా..మొగుళ్లు రారా అని వెటకారంగా రవితేజ చెప్పే డైలాగ్ తో హీరో క్యారెక్టర్ ను చెప్పకనే చెప్పకుండా ఎలివేట్ చేశారు.

Puri Jagannadh

ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని సూపర్ స్టార్ మహేష్ తో తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చూపించి, బిజినెస్ మేన్ తో మరోసారి హిట్ కొట్టి సెన్సేషనన్ క్రియేట్ చేశారు. ప్రభాస్ లుక్ నే మార్చేసిన దర్శకుడు. ఇలా చిరుతతో రామ్ చరణ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అల్లుఅర్జున్ ని దేశముదురుగా మార్చిన డైరెక్టర్ ఇలా దాదాపు యంగ్ జనరేషన్ హీరోలందరితో సినిమాలు చేసి హిట్ కొట్టిన దర్శకుడు పూరి జగన్నాథ్.

puri-jagannadh-director_

మాస్ మసాలాలు తనదైన రీతిలో నూరి తెలుగువారిని అలరించారు పూరి… చిత్రీకరణలో పెరిగిన వేగం, ఆయన అతి తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు తీసేలా చేసింది… ఈ తరం దర్శకుల్లో అంత స్పీడ్ ప్రదర్శిస్తున్నవారెవరూ లేరు… టాప్ హీరోస్ తోనూ, యంగ్ హీరోస్ తోనూ తనదైన పంథాలో చిత్రాలు రూపొందిస్తూ పూరి జగన్నాథ్ సాగిపోతున్నారు.

అందుకే పూరి సినిమాలంటే కొత్త క్రేజ్ ఉంటుంది. ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ తో ఇజం, కన్నడలో ఇషాన్తో రోగ్‌ తెరకెక్కిస్తున్న పూరీ త్వరలోనే ఎన్టీఆర్‌తో నేతాజీ తీసే ప్రయత్నంలో ఉన్నాడు. హీరోకు అసలు సిసలైన భాష్యం చెప్పిన పూరి ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని మరిన్ని హిట్లు అందివ్వాలని ఆశిస్తూ గ్రేట్‌ తెలంగాణ.కామ్‌ తరుపున జన్మదిన శుభాకాంక్షలు.

- Advertisement -