సచిన్‌ రహస్యాల వెల్లడిపై త్వరలోనే చర్యలు !

232
anurag thakur
anurag thakur
- Advertisement -

టీమిండియా క్రికెట్ సెలక్షన్ కమిటీ మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్‌పై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. రహస్యంగా ఉంచాల్సిన కొన్ని విషయాలను వెల్లడించాడని ఠాకూర్ ధ్వజమెత్తారు. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటించకపోతే వన్డే జట్టు నుంచి అతడికి ఉద్వాసన పలికేవారమని పాటిల్ వెల్లడించిన విషయం తెలిసిందే. బీసీసీఐతో నేరుగా సంబంధం ఉన్న సమయంలో పాటిల్ ఈ వ్యాఖ్యలు చేసింటే మరోలా ఉండేదని కూడా ఠాకూర్ హెచ్చరించారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత పాటిల్ బీసీసీఐ టాప్ సీక్రెట్స్ ను వెల్లడించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించాడు. భవిష్యత్తులో పాటిల్ కు ఏదైనా బాధ్యత అప్పగించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ సూచించారు. ఆయనపై చర్యలు ఉంటాయా? లేదా? అనే విషయంపై బోర్డులోని సరైన వ్యక్తులు త్వరలోనే చెబుతారని ఠాకూర్ స్పష్టం చేశారు.

sachin-dhoni

భారత క్రికెట్లో దిగ్గజంగా పేరున్న సచిన్ టెండూల్కర్, సక్సెస్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలకు గతంలో సంబంధించిన పలు రహస్యాలను పాటిల్ వెల్లడించాడు. భారత్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయిన ధోనిని ఆ పదవి నుంచి తొలగించే విషయంపై పలుసార్లు చర్చ కూడా జరిగిందని గత వారం పాటిల్ బహిర్గతం చేసిన విషయం తెలిసిందే.

2015 ప్రపంచ కప్ ప్రయోగ సమయంలో ధోనీ కెప్టెన్సీ కొత్తవారికి ఇచ్చి ప్రయోగం చేయాలని అనుకున్నామని.. కీలకమైన ప్రపంచకప్ ఉండడంతో నిర్ణయం మార్చుకున్నామని సందీప్ తెలిపాడు. ఇక సచిన్ రిటైర్మెంట్ ప్రకటించికపోతే ఆ సమయంలో జట్టు నుంచి తప్పించాలని సెలక్షన్ ప్యానెల్ భావించిందని టాప్ సీక్రెట్ ను బయటపెట్టాడు. అయితే సచిన్ ఎవరి సలహాలు పాటించకుండానే రిటైర్మెంట్ ప్రకటించాడని చెప్పాడు.

- Advertisement -