దమ్ముంటే సమాధానం చెప్పండి…!

227
Case filed against actor Prakash Raj
- Advertisement -

ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య విషయంలో ప్రధాని మోడీ తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. ఈ ఘటనపై ఆయన నిశ్శబ్దం సరికాదని నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడిన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన ఒక ర్యాలీలో పాల్గొన్న ఆయన.. మోడీతో పాటు యూపీ సీఎం పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనకు యోగిని చూస్తే యూపీ ముఖ్యమంత్రా? లేక.. గుడిలో పూజారా? అన్నది అర్థం కానట్లుగా ఉంటుందన్నారు.  ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్‌పై బీజేపీ నేతలు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ నేతలు ఆయనపై సెటైర్లు విసురుతున్నారు.

ఓ ప్రధానిని ఉద్దేశించి అలా అనడం సబబూ కాదంటూ లక్నోకు చెందిన ఓ న్యాయవాది ప్రకాశ్ రాజ్‌పై కేసు దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ‘ఎప్పుడైనా, ఎక్కడైనా నేను నిజమే మాట్లాడతా. మోడీ విషయంలోనూ నేను నిజమే మాట్లాడాను. అంతమాత్రానికే నన్ను యాంటీ మోడీ అనేస్తారా? ఆయన మన ప్రధాని. ఆయనపై నాకు గౌరవం ఉంది. కానీ కొన్ని విషయాల్లో మోడీతో ఏకీభవించలేను. నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్న వారికి నా ఎదురుగా వచ్చి సమాధానం చెప్పే ధైర్యం లేదు. ఇంత జరిగినా ఇప్పటికీ నా మాటలపైనే నిలబడతా అని చెప్పుకొచ్చారు ప్రకాశ్‌.

గౌరి లంకేష్ కుటుంబంతో ప్రకాష్‌రాజ్‌కు మంచి స్నేహ బంధముంది. దీంతో ఆయన కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతు విమర్శలు సందించారు.  ప్రధాని మోడీ నాకన్న పెద్ద నటుడు అని వ్యాఖ్యానించి సంచలనం రేపారు.

- Advertisement -