అత్యాచారం కేసులో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా అధినేత బాబా గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్‌కు 20 సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. గుర్మీత్ ప్రస్తుతం జైలులో ఉండగా ఆయన దత్తపుత్రిక హనీప్రీత్ పోలీసు కస్టడీలో ఉన్న ఉంది. వీరిద్దరిపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతండగా అనుకోని ఆహ్వానం లభించింది.
‘టాయిలెట్ డే’ ప్రచారంలో భాగస్వాములు కావాలంటూ వీరిద్దరికి ఐక్యరాజ్యసమితి ఆహ్వానం పలికింది. ఈ మేరకు ఐరాస తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. నవంబర్ 19న ప్రపంచ ‘టాయిలెట్ డే’ను జరుపుతారు. ఇందుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఐరాస వాటర్ బాడీ.. గుర్మీత్‌ను కోరింది.
అయితే గుర్మీత్ తో పాటు హనీ ప్రీత్‌కు సైతం ఐరాస ఆహ్వానం అందింది. ‘డియర్ హనీప్రీత్.. వరల్డ్ టాయిలెట్ డేకు మీరు, గుర్మీత్ మద్దతు ఇస్తారని ఆశిస్తున్నాం’ అంటూ ఐరాస వాటర్ నేడు ట్వీట్ చేసింది. కాగా.. హనీప్రీత్‌ను పోలీసులు అరెస్టు చేసిన రోజే ఐరాస ఈ ట్వీట్లు చేయడం గమనార్హం. అయితే, వీరిద్దరి అరెస్ట్ గురించి తెలియక ఐరాస ఆహ్వానం పంపిందని పలువురు నెటిజన్లు ట్వీట్ పోస్ట్ చేస్తున్నారు.
రోహ్‌తక్‌లోని సునరియా జైలులో రోజుకు రూ.40 కూలికి తోటపని చేస్తున్నాడు గుర్మీత్. డేరా సచ్చా సౌదాలో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన గుర్మీత్.. జైలు క్యాంటీన్ నుంచి మినరల్ వాటర్ తెప్పించుకొని తాగుతున్నాడు.