మెగా ప్రిన్స్‌తో ఘాజీ దర్శకుడు…!

219
Sankalp Reddy to do direct varun tej...!
- Advertisement -

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఘాజీ సంచలన  విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత దేశపు మొదట్టమొదటి సబ్ మెరైన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను రాబట్టి విమర్శకుల ప్రశంసలను అందుకుంది.

ఈ నేపథ్యంలో సంకల్ప్‌ రెడ్డి చేయబోయే నెక్ట్స్‌ ప్రాజెక్టుపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సంకల్ప్‌ చేయబోయే సినిమాపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది.కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి,  తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించబోతున్నారట.అయితే ఇప్పటికే వరుణ్, సంకల్ప్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న టాక్ వినిపిస్తోంది.

సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కనున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. పీవీపీ సంస్థ ఓకె చెపితే త్వరలోనే సంకల్ప్, వరుణ్ తేజ్ ల సినిమాలపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

- Advertisement -