- Advertisement -
నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఇటీవలే జరిగిన ఓ ఈవెంట్‌లో అత్యుత్సాహం ప్రదర్శించిన అభిమాని చెంప చెల్లుమనిపించిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది.
అనంతపురంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో భాగంగా నిర్వహించిన ర్యాలీలో బాలయ్య పాల్గొన్నారు. క్యాంపెయిన్ కొనసాగుతుండగా వెనక నుంచి ఓ అభిమాని అందరిని నెట్టుకుంటూ ముందుకువచ్చేందుకు ప్రయత్నించాడు. అతని చేయి తగలడంతో ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య..సదరు వ్యక్తి చెంప చెల్లుమనిపించాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.
https://www.youtube.com/watch?v=XM86qpHDuQ8
- Advertisement -