పెళ్ళి తర్వాత.. ప్లాన్‌ చేసుకున్న సామ్‌.. !

196
Samantha`s wedding:samantha`s bollywood debut confirmed..
- Advertisement -

దక్షిణాదిలో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన సమంత సమ్ థింగ్ డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. సమంత బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. త్వరలో పెళ్లి పీఠలెక్కనున్న ఈ బ్యూటీ పెళ్లి తరువాత కూడా హీరోయిన్ గా కొనసాగేందుకు ప్లాన్ చేసుకుంటోంది.

అంతేకాదు ఇప్పటి వరకు దక్షిణాది ప్రేక్షకులను మాత్రమే అలరించిన ఈ బ్యూటీ, పెళ్లి తరువాత ఓ బాలీవుడ్ సినిమాలో నటించనుందట. ప్రముఖ నిర్మాత రోని స్క్రూవాలా నిర్మిస్తున్న సినిమాతో బాలీవుడ్ అరంగేట్రానికి రంగం సిద్ధం చేసుకుంటోంది సామ్.

   Samantha`s wedding:samantha`s bollywood debut confirmed..

ప్రస్తుతం రాజుగారి గది 2 రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న సమంత, తెలుగు, తమిళ భాషల్లో బిజీగా హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఈ నెల 6న నాగచైతన్యను పెళ్లాడనున్న ఈ భామ, తరువాత షార్ట్ గ్యాప్ తీసుకొని తిరిగి షూటింగ్ లకు హజరయ్యేలా ప్లాన్ చేసుకుంటోంది.

- Advertisement -