- Advertisement -
జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా హత్యకేసులో కీలక ఆధారాలు లభించాయి. ఈ విషయాన్ని కర్నాటక హోంమంత్రి రామలింగారెడ్డి చెప్పారు.
అయితే వాళ్లను దోషులుగా తేల్చడానికి మాత్రం కావాల్సిన అధనపు ఆధారాలను ఇంకా సేకరిస్తున్నట్లు చెబుతూనే..ఇప్పుడే హంతకుల పేర్లను బయట పెట్టబోమని కూడా రామలింగారెడ్డి తెలిపారు.
అంతేకాకుండా గౌరీ లంకేష్ హత్యపై సిట్ విచారణ జరుపుతున్న నేపథ్యంలో హంతకుల గురించి ఇప్పుడే బయటకు చెబితే..కేసు విచారణపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. కాగా..సెప్టెంబర్ 5న గౌరీ లంకేష్‌ను ఆమె ఇంటి ముందే దుండగులు కాల్చి చెప్పిన విషయం తెలిసిందే.
- Advertisement -