చీపురు పట్టిన అనుష్క శర్మ

193
anushka
- Advertisement -

బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ముంబయిలోని వర్సోవా బీచ్‌ను శుభ్రం చేశారు. స్వచ్ఛ భారత్‌ ప్రచారంలో భాగంగా ‘స్వచ్ఛతే సేవా’ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని మోడీ, అనుష్క శర్మకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే అనుష్క శర్మ వర్సోవా బీచ్‌లో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాలో తెలిపింది. బీచ్ ను శుభ్రం చేస్తుండగా దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.

‘మన దేశం మన తల్లి లాంటింది. మన దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. ప్రతి రోజు మన కోసం మనం ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం. కొంచెం ఎరుక, స్పృహతో ఉండటం ద్వారా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవచ్చు. తద్వారా ఆరోగ్యకరమైన పరిసరాల్లో జీవించే అవకాశం ఉంటుంది… ఈ రోజు నేను, నా స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి వర్సోవా బీచ్ కు వెళ్లి శుభ్రం చేశాము. బీచ్ ను శుభ్రం చేస్తూ నేను పొందిన సంతోషం అంతా ఇంతా కాదు .. మాటల్లో చెప్పలేను. ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మాటలను గుర్తుచేసుకుందాం..‘టన్నుల కొద్దీ చేసే బోధనల కన్నా కొద్దిపాటి అనుభవం ఎంతో విలువైంది’…అందుకని, దయచేసి, మీ వంతు పాత్ర నిర్వహించండి’ అని ఆ పోస్ట్ లో పేర్కొంది.

- Advertisement -