తెలంగాణ రాష్ట్రా టూరిజానికి మరో అరుదైన పురస్కారం లభించింది. జాతీయ పర్యాటక విభాగం అవార్డుల్లో రాష్ట్ర టూరిజానికి 8 అవార్డులు వరించాయి. సెప్టెంబర్ 27న ప్రపంచ టూరిజం దినోత్సవం పురస్కరించుకొని.. ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రభుత్వ అధికారులు అందుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ టూరిజం శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ కమిషనర్ సునీత భగవత్, ఎండీ క్రిస్టినా చోంగ్తు, చౌమొహల్లా ప్యాలెస్ స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, వరంగల్ మేయర్ నరేందర్, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఓఝా, సీనియర్ గైడ్ కాశీనాథ్ అవార్డులను స్వీకరించారు
అవార్డులు సాధించిన విభాగాలు:
-స్వచ్ఛత
-బెస్ట్ టూరిస్ట్ గైడ్
-బెస్ట్ టూరిజం ప్రమోషన్ పబ్లిసిటీ మెటీరియల్
-బెస్ట్ హెరిటేజ్ సిటీ (వరంగల్)
-బెస్ట్ మెయింటెయిన్డ్ అండ్ డిసెబుల్డ్ ఫ్రెండ్లీ మాన్యుమెంట్
-సివిక్ మేనేజ్ మెంట్ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇండియా (జిహెచ్ఎంసీ)
-బెస్ట్ స్టాండ్ అలోన్ కన్వెన్షన్ సెంటర్ (లోనియా ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్)
-బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ (అపోలో హెల్త్ సిటీ, హైదరాబాద్)