మెగా హీరోకి మేనత్తగా అనసూయ..!

245
- Advertisement -

ఇప్పుడు బుల్లి తెర యాంకర్లకు అందాలు ఆరబోయడం అనేది పెద్ద ఎసెట్ గా మారింది. ఇప్పుడు అదే తరహాలో మోస్ట్ గ్లామర్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనసూయ. వయసుతో సంబంధం లేకుండా ఈ భామ వేసే డ్రెస్సులకు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాగే సినిమాల్లో స్పెషల్ రోల్స్, ఐటం సాంగ్స్‌ చేస్తూ అలరిస్తోంది. అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఒక స్పెషల్ రోల్ చేస్తోంది. అది కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నాటిస్తోన్న రంగస్థలం1985 సినిమాలో నటిస్తుంది ఈ భామ.

Anasuya Special Role In Charan Movie
రామ్ చరణ్ హీరోగా నాటిస్తోన్నఇప్పటికే ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది. అయితే అనసూయ ఈ సినిమాలో ఏ పాత్ర చేస్తోందా అని అందరూ అనుకున్నారు. బహుశా స్పెషల్ సాంగ్ లో చిందులు వేస్తుందేమో అనుకున్నారు. కానీ ఎవరు ఉహించని విధంగా రామ్ చరణ్ కి మేనత్త పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది.

Anasuya Special Role In Charan Movie

అయితే ఇంతకుముందే సోషల్ మీడియాలో పల్లెటూరి అమ్మాయిలాగా ఉండే ఒక ఫోటోని రిలీజ్ చేసింది. అయితే ఆ ఫొటోలో కేవలం తన పాదాలని మాత్రమే చూపించింది. అయితే సినిమాలో మొత్తం అమ్మడు పల్లెటూరి మహిళలా కనిపించనుందట. అనసూయ పాత్ర సరికొత్తగా ఉండనుందని తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో న్యూ లుక్ లో దర్శనం ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. విలక్షణ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కి రానుంది.

- Advertisement -