టీమిండియాకు మరో స్పిన్నర్ దొరికాడు

254
- Advertisement -

భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో వన్డే మ్యాచ్ సంధర్బంగా ఉదయం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ధోనీ, సరదాగా కాసేపు బౌలింగ్ చేశాడు. ఎమ్మెస్ ధోనీ ప్రాక్టీస్ సెషన్‌లో బ్యాట్స్‌మెన్‌కు స్పిన్ బౌలింగ్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనూ ధోనీ బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. వన్డేల్లో అతనో వికెట్ కూడా తీశాడు. అయితే అతనో మీడియం పేసర్‌గానే అందరికీ తెలుసు. తొలిసారి తన స్పిన్ టాలెంట్‌ను కూడా చూపించాడు. కుల్‌దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్‌లతో కలిసి నెట్స్‌లో ధోనీ బౌలింగ్ చేశాడు. ఈ వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఈ వీడియో చూసి ధోనీ ఫ్యాన్స్ తెగ ఖుషీగా ఉన్నారు. ధోనీ ఏదైనా చేయగలడంటూ పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. కెప్టెన్సీ, వికెట్ కీపింగ్, బ్యాటింగ్, ఫినిషర్, బౌలర్.. ఇలా ధోనీ ఏదైనా చేయగలడంటూ ప్రశంసించారు.

- Advertisement -