సిడ్నీ బతుకమ్మ మరియు దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ నిర్వయించిన బతుకమ్మ ఉత్సవాలతో సిడ్నీ నగరం పులకించింది. ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో….బంగారు బతుకమ్మ ఉయ్యాలో….ఉయ్యాల పాటలు పాడారు.బతుకమ్మ ఆటా…పాటతో సిడ్నీ నగరం పులకించింది. సప్తవర్ణాల శోభితమైన పూలదొంతరల బతుకమ్మలు చూడముచ్చటేశాయి. వాటి తయారీకి ఉదయం నుంచే కష్టపడ్డారు. ఉత్తమ బతుకమ్మలను నిర్వాహకులు ఎంపిక చేశారు. వాటిని తయారు చేసిన మహిళలకు బహుమతులను ప్రదానం చేశారు.
మనసంతా తెలంగాణపైనే వేల మైళ్ల దూరంలో ఉంటున్నా.. తెలంగాణ ఎన్నారైల మనసుంతా తెలంగాణ పైనే ఉంటుందన్నారు సిడ్నీ బతుకమ్మ అధ్యక్షుడు అనిల్ మునగాల తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను , ఆచార వ్యవహారాలను పాటిస్తుండటం ఇక్కడే పుట్టి పెరిగిన పిల్లలకు కూడా తెలంగాణ సంస్కృతిని తెలియజెప్పడమే. సిడ్నీసైడర్స్ గా పిలువబడే సిడ్నీ వాసులుతెలంగాణకే పరిమితం అయిన పూలజాతరతో పరవశించిపోయారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జోడి మక్కే, జియోఫ్ లె, హుగ్ మక్డ్రాట్ బతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ఇండియన్ హై కమిషన్ కార్యదర్శి వేడుకలు పూర్తయ్యేంత వరకూ ఉన్నారు.