తెలుగు చిత్ర పరిశ్రమలో రకుల్ ప్రీత్ సింగ్ క్రేజీ తార. చిన్న సినిమాలతో తన కెరీర్ ను స్టార్ట్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఊహించని అవకాశాలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ప్రస్తుతం తెలుగులో భారీ చిత్రాల్లో రకుల్ కోలీవుడ్‌లోనూ బిజీ ఆర్టిస్ట్‌గా మారింది. టాప్ హీరోలంతా రకుల్ కోసం వెయిట్ చేస్తున్నారట.
ఈ ఏడాది ‘రారండోయ్ వేడుక చూద్దాం’ .. ‘జయ జానకి నాయక’ వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్న రకుల్, ఈ నెల 27న ‘స్పైడర్’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో ఆమె వుంది. మరో వైపున కోలీవుడ్ లోను ఆమె హవా మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మొదట్లో రకుల్ ప్రీత్ సింగ్ కోలీవుడ్ లో అంతగా రాణించలేకపోయింది. పాపం ఎందుకోగానీ తమిళ ప్రేక్షకులు రకుల్ ని దగ్గరకు తీసుకోలేకపోయారు కానీ స్పైడర్‌తో ఆమె బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది. ‘స్పైడర్’ ప్రమోషన్స్ కారణంగా రకుల్ అక్కడి హీరోలందరి దృష్టిలో పడిపోయిందట. కార్తీ జోడీగా ఒక సినిమా చేసిన ఆమె, విశాల్ సినిమా కోసం ఎంపిక అయింది.
డేట్స్ సర్దుబాటు చేయలేనని రకుల్ అంటే, ఎప్పుడు వీలైతే అప్పుడే సర్దుబాటు చేయమని విశాల్ అనడం ఆమెకి గల క్రేజ్ కు నిదర్శనం. ఇక అజిత్ .. విజయ్ .. శింబు .. శివ కార్తికేయన్ తదితర హీరోలంతా, తమ తదుపరి చిత్రాల్లో రకుల్ అయితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట.