దసరా కానుకగా… బాలకృష్ణుడు

213
Nara Rohith Balakrishnudu teaser on dasara
- Advertisement -

వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. వరుస సినిమా విజయాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ యువ హీరో శమంతకమణి విజయంతో బాలకృష్ణుడుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. షూటింగ్ పూర్తి కావొచ్చిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుండగా దసరాకి టీజర్‌తో వస్తున్నాడు.

ఇటీవలె నారా రోహిత్ పుట్టినరోజు సందర్బంగా   ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదలచేశారు యూనిట్ సభ్యులు. యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న ఈసినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సిక్స్ పాక్స్ బాడీతో తన కెరీర్లోనే మొదటిసారి నారా రోహిత్ వెండితెరపై దర్శనమిస్తున్నాడు. రెజీనా హీరోయిన్‌గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది.

కెరీర్‌లో నారా రోహిత్‌కు ఈ సినిమా 15వ చిత్రం. ఈ సినిమా కోసం రోహిత్ ఏకంగా 25 కేజీల బరువు తగ్గాడు.  గతంలో ఎన్నడూ చూడని విధంగా కొత్త గెటప్ కనిపించి అభిమానులకు పండుగ చేశాడు. పొడగాటి జుట్టు, సిక్స్‌ప్యాక్‌తో స్పెషల్‌గా కనిపించడం ఫస్ట్‌లుక్‌లో విశేషం.దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి.

Nara Rohith Balakrishnudu teaser on dasara

- Advertisement -