వారంరోజుల్లో నివేదిక ఇవ్వండి:కేటీఆర్‌

237
ktr review on mission bhageeratha
- Advertisement -

జలమండలి మరియు హెచ్ యండిఏ ప్రాజెక్టులపైన మంత్రి కేటీ రామారావు సమీక్షించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో అయా కార్పోరేషన్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జలమండలి చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాలను అధికారులు మంత్రికి అందజేశారు. నగరానికి వచ్చే కృష్ణ మరియు గోదావరి జలాలను కలిపి వాడుకునేలా వీలుకల్పించే ఇంటర్ connected గ్రిడ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కోరారు. ప్రస్తుతం కృష్ణా బేసిన్లో నీటి కొరత ఎదుర్కొంటున్న నేపథ్యంలో, inter connected గ్రిడ్ ఉండి ఉంటే గోదావరి జలాలను వాడుకునే అవకాశం ఉండేదన్నారు. ఇప్పటికైనా ఈ గ్రిడ్ ఏర్పాటుపైన పూర్తి స్ధాయి అధ్యాయనం చేసి వారంరోజుల్లో ఒక నివేదిక ఇవ్వాలని మంత్రి జలమండలి అధికారులను కోరారు. ఈ ప్రయత్నం ద్వారా అవుటర్ రింగ్రోడ్డు పరిధి లోపల ఉన్న మొత్తం నగరానికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేసే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.

జలమండలి చేపట్టనున్న ఒఅర్ అర్ రింగ్ మెయిన్ తో ప్రస్తుతం మంజీరా ద్వారా నీరు ఇస్తున్న ప్రాంతాలకి నీటి కష్టాలు తీరుతాయని మంత్రి కెటి రామారావు అన్నారు. ఈ ప్రాంతాలకు గోదావరి జలాలను అందించేకు వీలు కల్పించే ఈ రింగ్ మెయిన్ పనులను అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మించాలని మంత్రి జలమండలి అధికారులకు అదేశాలు జారీచేశారు. పెరుగుతున్న నగర విస్తరణకు అనుగుణంగా జలమండలి తన ప్రాజెక్టును రూపొందించుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

IMG-20170919-WA0062

హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేయనున్న కేశవాపురం రిజర్వాయర్ ప్రణాళికలపైన అధికారులు మంత్రికి వివరాలు అందజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కనీసం 20 టీఎంసీల నీరు ఎప్పుడూ హైదరాబాద్ నగర నీటి అవసరాలకోసం నిల్వ చేసుకునే వీలుంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు తాలుకు డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపొర్టు తయారు చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టుకు అవసరం అయిన నిధుల సేకరణ, మార్గాలు, పద్దతులపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం అయ్యి అయన సహాకారం తీసుకోవాలని మంత్రి అధికారులకు తెలిపారు. జలమండలి, హెచ్ యండిఏ, జియచ్ యంసి ప్రణాళికలను సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ మేరకు అవుటర్ రింగ్ రొడ్డు, రేడియల్ రొడ్ల వెంబడి జలమండలి ప్రణాళికలు, పనులను సమన్వయం చేసుకోవాలన్నారు. జలమండలి పరిధి పెరుగుతున్న నేపథ్యంలో కార్పోరేషన్ అవసరాల మేరకు ఉద్యోగుల రేషనలైజేషన్ చేసుకోవాలని, అవసరం అయితే ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలన్నారు. నగరంలో మాన్యువల్ స్కావేంజింగ్ పూర్తిగా అరికట్టే దిశగా, జల మండలి వినియోగంలోకి తీసుకువచ్చిన మిని ఏయిర్ టెక్ మిషన్ల ప్రయోగం దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిందన్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి ప్రశంసలు రావాడం, డీల్లీ మెట్రో జల్ బోర్డు కూడా ఇలాంటి మేషిన్ల కోసం అర్డర్ ఇవ్వడం వంటి అంశాలను అధికారులు మంత్రికి వివరాలు అందజేశారు. త్వరలోనే జియచ్ యంసి పరిధిలోనూ మరిన్ని మినిఏయిర్ టెక్ మిషన్లను కోనుగోలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

IMG-20170919-WA0064

హెచ్ యండిఏ పైన సమీక్ష నిర్వహించిన మంత్రి
హెచ్ యండిఏ పైన సమీక్ష నిర్వహించారు మంత్రి కెటి రామారావు. ఈ సందర్భంగా హెచ్ యండిఏ ప్రాజెక్టులపైన సవిరంగా చర్చించారు. అవుటర్ రింగ్ రోడ్డు చుట్లు ఏల్ ఈడీ లైట్ల బిగింపు దశల వారీగా పూర్తి చేయాలన్నారు. దీంతోపాటు పివిఏన్ అర్ ఏక్స్ ప్రెస్ వే, హుస్సెన్ సాగర్ చుట్టు ఏల్ యిడీ లైట్ల బిగింపు దీపావళి నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఏల్ అర్ ఏస్ దరఖాస్తుల పరిష్కారం ఈ నెలఖరు నాటికి పూర్తి కావాలని మంత్రి , కమీషనర్కు అదేశాలు జారీ చేశారు. హెచ్ యండిఏ చేపట్టిన లాజిస్టిక్ పార్కుల పనుల వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటి దాకా హెచ్ యండిఏ వద్ద ఉండిపోయిన లే అవుట్లలోని చిన్న చిన్న స్థలాలను ఆలాట్ మెంట్ ప్రాథిపాధికన కాకుండా పారదర్శకంగా వేలం వేయాలని అదేశాలు జారీ చేశారు. ఈ సమావేశాల్లో పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జలమండలి యండి దానకిషోర్, హెచ్ యండిఏ కమీషనర్ చిరంజీవు, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.

- Advertisement -