విడుదలకు ముందే వివాదాస్పదంగా మారిన అర్జున్ రెడ్డి తర్వాత మాత్రం కలక్షన్స్ తో సత్తా చాటింది. ప్రేక్షకుల ఆదరణతో అన్నిసెంటర్లలో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ మూవీలో హీరోగా చేసిన విజయ్ దేవరకొండ, హీరోయిన్ షాలిని ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఈ ఇద్దరు ఇప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీని కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్లో రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ధనుష్‌కు చెందిన వండర్ బార్ ఫిలిమ్స్ సంస్థ ద్వారా రీమేక్ హక్కులు కూడా కొనేశాడు. అయితే అర్జున్‌రెడ్డి పాత్ర కోసం తమిళ హీరో ఆర్యను సంప్రదించారని సమాచారం.
రాజా రాణి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా తెగ ఆకట్టేసుకున్న తమిళ హీరో ఆర్య. గతంలోనే వరుడు వంటి చిత్రాలలో విలన్ గా కూడా నటించి మెప్పించిన ఈ హీరోకి.. కొత్తదనం ఉండే కథలంటే మహా మక్కువ. తన కేరక్టర్లో నావెల్టీ పాయింట్ ఉందంటే చాలు మిగిలిన ఎలాంటి అంశాలను.. హీరోయిజం లాంటి వాటిని పట్టించుకోకుండా సినిమా చేసేస్తుంటాడు.
తెలుగు సినిమాల్లో అత్యంత బోల్డ్ క్యారెక్టర్ గా గుర్తింపు పొందిన అర్జున్ రెడ్డి పాత్రలో నటించేందుకు చాలామంది తమిళ నటులు ధైర్యం చేయలేదు. కానీ ఆర్య మాత్రం అర్జున్ రెడ్డి క్యారెక్టర్ లో కనిపించేందుకు సై అన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికి అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ.. అర్జున్ రెడ్డి రోల్ కు ఆర్య పర్ఫెక్ట్ ఛాయిస్ అంటున్నారు సినీ జనాలు.