ఎన్టీఆర్- రాశిఖన్నా- నివేదథామస్ కాంబినేషన్లో రానున్న మూవీ ‘జై లవకుశ’. ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీలోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ మూవీ చిత్ర బృందం మూడు టీజర్లతోనే బిజినెస్ ఓ రేంజ్లో జరిగినట్టు సమాచారం. టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ వంటి యంగ్ యాక్టర్స్ సినిమాలకు హిందీలో మంచి క్రేజ్ వుంది. అందుకే వీళ్ల సినిమాలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసిపెడుతున్న హిందీ ట్రేడ్ వర్గాలు తాజాగా జై లవ కుశ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ని ఓ నేషనల్ ఎంటర్టైన్మెట్ టీవీ ఛానెల్‌కి దక్కేలా చేసినట్టు తెలుస్తోంది.
ఇప్పటికే తెలుగులో రూ. 14.5 కోట్లకు వెళ్లగా, హిందీలోనూ ఊహించని రేటుకి వెళ్లింది. జీ ఛానెల్ హిందీ శాటిలైట్ రైట్స్‌ని రూ. 11.5 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ఇన్సైడ్ సమాచారం. దీనికితోడు టెక్నికల్, ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగుండడం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. ఒక్క శాటిలైట్ రైట్స్ రూపంలో నిర్మాతకు దాదాపు రూ. 26 కోట్లు వచ్చినట్టేనన్నమాట!. జై లవ కుశ చిత్ర నిర్మాత కళ్యాణ్ రామ్‌కి బిజినెస్ పరంగా ఇది కలిసొచ్చే అంశం. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించగా అతడి సరసన రాశి ఖన్నా, నివేదా థామస్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించాడు.