పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించడం ద్వారా ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ ఒక్కసారిగా పాప్యులర్ అయిపోయాడు. ఇదే సమయంలో వవన్ అభిమానుల నుంచి అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నిర్మాత బండ్ల గణేష్ లాంటి వారైతే ఏకంగా మాడిపోతావంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే తాజాగా మరోసారి పవన్‌ను ఎద్దేవా చేశాడు కత్తి మహేష్.
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అజ్ఞానాన్ని తాను పట్టించుకోకుండా ఎలా ఉండగలనని మహేశ్ కత్తి అన్నాడు. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ రెండు రోజుల క్రితం హత్యకు గురైన నేపథ్యంలో నిన్న రాత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని ట్వీట్లలో పవన్… గౌరీ లంకేశ్ పేరును గౌరీ శంకర్ అని రాసుకొచ్చాడు. దీన్ని గుర్తించిన మహేశ్ కత్తి… హత్యకు గురైన జర్నలిస్ట్ పేరు గౌరీ శంకర్ కాదు గౌరీ లంకేశ్ అని పవన్‌ని ఎద్దేవా చేశాడు.
మోదీ, హిందుత్వ విధానాలకు మద్దతు తెలిపిన పవన్ ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడని మహేశ్ కత్తి అన్నాడు. ఈ హత్య కేసులో నిజానిజాలు తేలేవరకు తాను ఈ హత్యపై ఎవరిపై ఎటువంటి విమర్శలు చేయబోనని పవన్ అంటున్నాడని మహేశ్ కత్తి పేర్కొన్నాడు. పవన్ కల్యాణ్ కులాలకు, మతాలకు అతీతమైన వ్యక్తని, అలాగే జ్ఞానం లేని వ్యక్తని తనకు ఇప్పుడు అర్థమైందని మహేశ్ కత్తి ఎద్దేవా చేశాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ తప్పుగా చేసిన ఆ ట్వీట్‌ను కూడా ఆయన పోస్ట్ చేశాడు.
#JanaSena
GauriShankar#3 pic.twitter.com/kfQjSEXUh7— Pawan Kalyan (@PawanKalyan) September 7, 2017