ఎంఎస్ ధోని…మరో అరుదైన ఫిట్

222
MS Dhoni milestones to rare overseas whitewash
- Advertisement -

శ్రీలంకతో జరిగిన దైపాక్షిక సిరీస్ ద్వారా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ జట్టుకు తన అవసరం ఎంతో చూపించాడు. ఇటు బ్యాటింగ్‌లో, అటు కీపింగ్‌లో…రివ్యూ సిస్టమ్‌లో తనదైన మార్క్‌ చూపించిన  ధోని అరుదైన ఫిట్‌ని సాధించాడు.

బ్యాటింగ్ లో హెలికాప్టర్ షాట్లకు మారుపేరైన ధోని.. కీపింగ్ లో అద్భుతమైన క్యాచ్ లతో పాటు స్టంపింగ్ లకు తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. డీఆర్ఎస్ ను ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలిసిన ధోని..మరొకసారి ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేసి సక్సెస్ కావడంతో ధోని మార్మోగిపోయింది.

వన్డేల్లో మూడొందల మ్యాచ్ ల మైలురాయిని దాటడంతో పాటు వంద స్టంపింగ్ ల రికార్డును, అత్యధిక నాటౌట్ల రికార్డును సైతం లంక పర్యటనలో ధోని సాధించారు. బుధవారం జరిగిన ఏకైక ట్వంటీ 20 మ్యాచ్ లో ధోని మరో వరల్డ్ రికార్డును కైవసం చేసుకున్నారు.

విదేశాల్లో అత్యధిక అవుట్లు చేసిన వికెట్ కీపర్ గా ధోని రికార్డు నెలకొల్పారు. నిన్నటి మ్యాచ్ లో   మాథ్యూస్ ను స్టంప్ అవుట్  చేసి విదేశాల్లో 476 అవుట్లను రికార్డు ఫిట్‌ను ధోని సాధించాడు. తద్వారా దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్(475) పేరిట ఉన్న రికార్డును ధోని బద్దలు కొట్టారు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్(460) మూడో స్థానంలో ఉన్నారు.

ట్వంటీ 20ల్లో ధోని 67 అవుట్లు చేసి అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాత స్థానంలో పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మాల్(60) నిలిచాడు.

- Advertisement -