22 ఏళ్ల క్రితం కేటీఆర్‌ ఇలా..!

169
KTR Review on textiles department
- Advertisement -

సోషల్ మీడియాలో ఎప్పుడూ అందుబాటులో ఉండ‌టంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారని, ట్వీట్ల ద్వారా ఆయ‌న దృష్టి కి వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌పై వెంట‌నే స్పందిస్తారన్న సంగతి తెలిసిందే. కేసీఆర్‌ కొడుకుగా కంటే, సెలబ్రిటీగా కేటీఆర్‌కు ఫాలోయింగ్ ఉంది. తాజాగా కేటీఆర్ పోస్ట్ చేసిన ఈ ఫొటో నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షిస్తోంది.

22 ఏళ్ల క్రితం త‌న స్నేహితుల‌తో తీసుకున్న ఓ ఫొటోను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసి సంతోషం వ్య‌క్తం చేశారు కేటీఆర్‌. అప్ప‌టి త‌న స్నేహితుడు తాజాగా త‌న‌కు ఈ ఫొటో పంపాడ‌ని ఆయ‌న చెప్పారు. ఈ ఫొటో త‌న‌కు 1995 నాటి రోజుల‌ను గుర్తుచేసింద‌ని అన్నారు. ఈ ఫొటోను కేటీఆర్ తన కాలేజీ రోజుల్లో దిగిన‌ట్లు తెలుస్తోంది. అందులో కేటీఆర్‌ గ‌ళ్ల చొక్కావేసుకుని స్నేహితుల మ‌ధ్య హుషారుగా క‌నిపిస్తున్నారు. ఈ ట్వీట్‌కు స్పందిస్తూ ప‌లువురు త‌మ‌దైన శైలిలో రీట్వీట్ చేశారు. కాగా, ఐటీరంగంలో మంత్రి కేటీఆర్ చేసిన కృషికి మరో గౌరవం దక్కింది. ఐటీ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ గా స్కోచ్ అవార్డుకు మంత్రి కేటీఆర్ ఎంపికయ్యారు. ఈనెల 9న ఢిల్లీలో స్కోచ్ 49వ సదస్సు జరగనుంది. అదే రోజు మంత్రి కేటీఆర్ ఈ అవార్డు అందుకోనున్నారు. గతేడాది కూడా మంత్రి కేటీఆర్ స్కోచ్ ఛాలెంజర్ అవార్డు అందుకున్నారు.

- Advertisement -