బాలయ్య సమస్యకు అసలు కారణమిదే !

219
Exact Reason for Balakrishna's Voice Problem!
- Advertisement -

బాలయ్య 101 సినిమా పైసా వసూల్‌లో బాలయ్య యాక్షన్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బాలయ్య వంద సినిమాలు ఒకెత్తయితే.. 101వ సినిమా ఒక ఎత్తు అని పొగిడేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య నటనకు మంచి మార్కులే పడ్డప్పటికీ, పూరి జగన్నాథ్ డైరెక్షన్ జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు. కలెక్షన్లు కూడా పెద్దగా రాకపోవడంతో ఫ్యాన్స్ డిజాప్పాయింట్ అయ్యారు. అయితే గలగలా డైలాగులు చెప్పే బాలయ్య పైసా వసూల్ ఆడియో వేడుకలో గొంతు సమస్యతో బాధపడ్డ సంగతి తెలిసిందే.  పైసా వసూల్‌ స్టంపర్‌ టీజర్‌ విడుదలైనప్పుడు బాలయ్య  డైలాగుల్లో, మాటల్లో కొంత షివరింగ్ కనిపించింది. అయితే అప్పుడు బాలయ్యకు జలుబు, జ్వరంతో గొంతు ఇన్ఫెక్షన్ వచ్చిందనుకున్నారు. పైసా వసూల్ ఆడియో వేడుకలో కూడా బాలయ్య గొంతులో మార్పు లేదు. అంతేకాదు సెప్టెంబర్‌ 1న విడుదలైన సినిమాలో కూడా అదే గొంతు వినిపించింది. ఈ నేపథ్యంలో  బాలయ్య గొంతుకేమైందని  ఫ్యాన్స్‌ వర్రీ అయ్యారు.

Puri To Direct Balakrishna Again...!

దీనిపై ఈ మధ్య ఇంటర్వ్యూ లో బాలకృష్ణను అడగ్గా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను పాటలు సాధన చేస్తున్నానని, అందుకే తన గొంతు బొంగురు పోయిందని చెప్పారు బాలయ్య. తన తండ్రి ఎన్టీఆర్ నటించిన జగదేకవీరుని కథ సినిమాలోని శివశంకరి పాటను బాలయ్య సాధన చేస్తున్నానని చెప్పారు.. తనకు అత్యంత ఇష్టమైన పాట ఇదేనని , గత కొద్ది రోజులుగా ఇదే పాటను పాడుతున్నానని బాలయ్య తెలిపాడు. అందువల్లే తన గొంతు బొంగురు పోయిందని చెప్పారు. అంతేకాదు ఇదే పాటను  స్టేజ్ పై పాడతానని స్పష్టం చేశారు బాలయ్య.

Balakrishna-Latest-Photo-St

పైసా వసూల్ సినిమాలోనూ బాలయ్య కొన్ని పాత పాటలను హమ్మింగ్ చేశారు. మామా ఏక్ పెగ్‌ లా అంటూ పాటను కూడా పాడారు.  అయితే దీనిపై సంగీతం తెలిసినవాళ్లు మండిపడుతున్నారు.  బాలయ్య పాటల్లో శ్రుతి తప్పిందని.. శ్రుతి తప్పితే రాగం తప్పుతుందని.. సాధారణ పాటలను పాడడంలో శ్రుతి తప్పుతున్న బాలయ్య.. కఠినమైన శివశంకరి పాటను ఎలా పాడతారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కఠినమైన పాటలను పాడడానికి ఎన్నో సంవత్సరాలు సాధన చేయాల్సి ఉంటుందని లేకపోతే ఇలా గొంతు పనికి రాకుండా పోతుందని సలహా ఇస్తున్నారు. బాలయ్య తాను అనుకున్నది సాధించేవరకు నిద్రపోరన్న సంగతి తెలిసిందే… బాలయ్య కోరిక తీరాలని కోరుకుందాం..

https://youtu.be/bVcggsJXWM8

- Advertisement -