తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన అర్జున్ రెడ్డి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఓవర్సీస్‌తో పాటు విడుదలైన ప్రతీ ప్రాంతంలోనూ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తెలుగు సినీ చరిత్రలో మరో వందేళ్ల పాటు ఈ సినిమా గుర్తుండిపోతుందంటూ క్రిష్ వంటి స్టార్ డైరెక్టర్లు ఎందరో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోకి బోల్డ్ డైలాగ్స్ యువతకు తెగ నచ్చేశాయి. ఈ సినిమాపై వర్మ, కేటీఆర్ ప్రశంసల జల్లులు కురిపించగా తాజాగా అర్జున్ రెడ్డిని జక్కన్న కూడా ప్రశంసించాడు. అంతేనా సంమంత,రకుల్ ప్రీత్ అర్జున్‌రెడ్డి సినిమాపై తమదైన శైలిలో స్పందించారు.
అయితే ఈ సినిమాను తెరకెక్కించడానికి నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో, తన అన్నయ్యే నిర్మాతగా రంగంలోకి దిగాడని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, ఆయన తదుపరి సినిమా ఏదైనా తాము నిర్మిస్తామంటూ చాలామంది నిర్మాతలు ముందుకు వస్తున్నారట.
అయితే సందీప్ రెడ్డి తదుపరి సినిమా కూడా కొత్తగా .. ఒక ప్రయోగంలా ఉంటుందని సమాచారం. ఈ సినిమా పేరు ‘షుగర్ ఫ్యాక్టరీ’ అనీ .. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో కొనసాగుతుందని అంటున్నారు. అందువలన ఈ సినిమాకి తానే నిర్మాతగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఆయన వున్నట్టుగా చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించడానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సిద్ధమవుతున్నాడని అంటున్నారు.