సైరాలో వరుణ్‌ తేజ్ భామ..!

212
pragya jaiswal roped into sairaa
- Advertisement -

 మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల బ్యానర్ మీద రాంచరణ్ నిర్మిస్తున్న సినిమా సైరా నరసింహ రెడ్డి.. ఈ మూవీలో చిరుకి జోడీగా ఇప్పటికే నయనతారని ఫిక్స్ చేసేశారు. కానీ స్టోరీ ప్రకారం మూవీలో ముగ్గురు హీరోయిన్లు వుంటారనే టాక్ వినిపిస్తోంది.  ‘ఉయ్యాలవాడ’ ముగ్గురిని పెళ్లి చేసుకున్నారంట. ఆ ముగ్గురు భార్యల పేర్లు సిద్ధమ్మ.. పేరమ్మ.. ఓబులమ్మ అంట. ‘చిరు’ సరసన ఒక హీరోయిన్ ను ఎంచుకోవడానికే చాలా కష్టమైంది. చాలా పేర్లను పరిశీలించి చివరికి ఆమెను ఫైనలైజ్ చేశారు. మరో హీరోయిన్‌గా రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘నక్షత్రం’, ‘జయ జానకి నాయక’ సినిమాల్లో నటించిన ప్రగ్యా జైస్వాల్‌కి ‘సైరా’లో ఆఫర్ వచ్చిందని ఫిల్మ్‌ నగర్‌లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Syeraa Narasimha Reddy Leaked Dialogues|

ఆ ముగ్గురు హీరోయిన్లలో ప్రగ్యాని ఓ హీరోయిన్‌గా ఫైనల్ చేశారని వార్తలొస్తున్నాయి. నరసింహారెడ్డి వెంట ఉండే మహిళా యోధురాలిగా కనిపించబోతోందట ప్రగ్యా.ఇది వరకూ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కంచె’ సినిమాలో నటించింది ప్రగ్యా. ఆ పిరియాడికల్ సినిమాలో ఈమె నటనకు, లుక్స్ కు మంచి మార్కులే పడ్డాయి. సైరా కూడా పిరియాడికల్ మూవీ కావడం.. అది కూడా మెగాస్టార్ సినిమా కావడం.. విశేషమే. అదే నిజమైతే ప్రగ్యాకి బంపర్ ఆఫర్ తగిలినట్టే. ఐతే.. ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.

- Advertisement -