సెలీనా జైట్లీ.. తెలుగువారికి కూడా పరిచయం ఉన్న నటి. ఈ భామ ప్రధానంగా చేసింది బాలీవుడ్ సినిమాలే అయినా.. ఒకటీ అర తెలుగు సినిమాల్లో కూడా నటించింది. అయితే ఈ అమ్మడు ప్రస్తుతం మార్పుల గురించి సందేశాలిస్తోంది.
ఆ సందేశాలు కూడా శారీరకంగా వచ్చే మార్పుల గురించి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి శారీరకంగా వచ్చే మార్పులను నెగిటివ్ గా తీసుకోకండీ.. అని అంటోంది.
గర్భవతి అయ్యాకా కడుపుతో పాటు.. శారీరకంగా వచ్చే మార్పులకు భయపడాలసిన అవసరం లేదని చెప్పుకొస్తోంది. అయితే ఈ అమ్మడు ఊరికే చెప్పడం కాదు.. ప్రస్తుతం గర్భవతి అయిన ఆమె పూర్తి నగ్నంగా మారి, తన రూపాన్ని చూపిస్తూ.. సందేశాన్ని ఇస్తోంది.
బాత్ టబ్బులో ఫొటోలు దిగింది సెలీనా. వాటిని ఆమె తన అధికారిక ఇన్ స్టాగ్రమ్ అకౌంట్ లో పోస్టు చేసింది. దానికి తోడు సుధీర్ఘమైన సందేశాన్ని కూడా జోడించింది. ఇది వరకూ కూడా సెలీనా ఈ తరహా పోస్టులు పెట్టింది.
ఈ మధ్యనే ప్రెగ్నెంట్ గా బికినీలో ఫొటోలు దిగి పోస్టు చేసింది. ప్రెగ్నెన్సీతో వచ్చే శారీరక మార్పులు మహిళల్లో ఆత్మన్యూనతకు కారణం కాకూడదనేది సెలీనా అభిప్రాయం. ఇదిలా ఉంటే..పీటర్ హాగ్ అనే విదేశీయుడిని వివాహం చేసుకుని ఇది వరకే కవలలకు జన్మనిచ్చింది సెలీనా.
ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్ అయిన సెలీనా త్వరలోనే మరో కవల జంటకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని సెలీనా దంపతులే ప్రకటించారు.