జీహెచ్‌ఎంసీలో 300 మంది ఇంజినీర్లు..

171
KTR reviews road repair works with GHMC officials
- Advertisement -

హైదరాబాద్ నగర ప్రణాళికబద్దమైన ప్రగతికి, ప్రస్తుతం నడుస్తున్న మౌళిక వసతుల కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జియచ్ యంసి పరిధిలో ఉన్న ఇంజనీరింగ్ సిబ్బందికి అదనంగా మరో 300 మంది ఇంజనీర్ల సేవలను వినియోగించకోనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగర స్థాయికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం స్వల్ఫకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తుందని,  వీటిలో భాగంగా పలు మౌళిక వసతులు కల్పన కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ముఖ్యంగా నగర పరిధిలో రోడ్లు, స్కైవేలు, మూసి అభివృద్ది, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కోసం సూమారు 20 వేల కోట్లు రూపాయాలను ఖర్చు చేసున్నామన్నారు.

ఇంత పెద్ద ఎత్తున చేపట్టిన ఈ ప్రాజెక్టులు పర్యవేక్షణ, అనుకున్న గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు పెద్ధ ఎత్తున ఇంజనీరింగ్ సిబ్బంది అవసరం అన్నారు. దీంతోపాటు తాము చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఒకటిన్నర, రెండు సంవత్సరాల్లో పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని, వీటి పర్యవేక్షణ, అమలు కోసం అదనంగా 300 మంది సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్లను నేషనల్ అకాడమీ అప్ కన్స్ట్రక్షన్(న్యాక్ ) ద్వారా శిక్షణ ఇప్పించి, వారి సేవలను వినియోగించుకుంటామన్నారు.

హైదరాబాద్ రొడ్డు డెవలప్ మెంట్ కార్పోరేషన్, మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్, డబుల బెడ్ రూం ప్రాజెక్టుల కాలపరిమితుల వారీగా వీరిని నియమించుకుంటామన్నారు. రాష్ట్ర్ర వ్యాప్తంగా సూమారు 2లక్షల 80 వేల డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తుంటే, హైదరాబాద్ నగరంలోనే లక్ష ఇళ్లను నిర్మిస్తున్నామని, వీటన్నింటికీ టెండర్లు పూర్తయ్యన్నారు.

సూమారు 110 సైట్లలో పనులు జరుగుతాయని, ఇలాంటి చోట్ల ఇంజనీరింగ్ సిబ్బంది అవసరమని, దీంతోపాటు నగరంలోని 150 డివిజన్ లకు ఒక్కొక్క ఏఈని ప్రత్యేకంగా రోడ్ల నిర్వహణ భాద్యతలు అప్పజేప్పనున్న నేపథ్యంలో మరో 150 ఇంజనీర్లు అసవరం అవుతారన్నారు. దీంతోపాటు మూసి, రోడ్డు డెవలప్ మెంట్ కార్పోరేషన్ కోసం  మరికొంత మంది అవసరం అయిన నేపథ్యంలో కొత్తగా ఈ 300 మంది ఇంజనీర్లను జియచ్ యంసి నియమించుకుంటుదన్నారు. ఈ మెత్తం నియామకాలు సెప్టెంబర్ నాటికి పూర్తి చేసుకోవాలని కమీషనర్ కు మంత్రి అదేశాలు జారీ చేశారు. నగరంలో సంవత్సరంలోపు ప్రజలకు మార్పు చూపించాలన్న లక్ష్యంతో ఈ నియామకాలు చేస్తున్నామన్నారు.

ఈ నియామకాలతో పనులు వేగంగా జరగడంతోపాటు, పనుల్లో మరింత పారదర్శకత, సమన్వయం, క్వాలీటీ పెరుగుతుందని మంత్రి కెటి రామారావు తెలిపారు. పనుల నాణ్యతలో రాజీ లేకుండా చూసేందుకే ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలిపారు. మంత్రి అదేశాల నేపథ్యంలో జియచ్ యంసి అధికారులు, న్యాక్ అధికారులు, ప్రాజెక్టుల అధికారులు, నియామాకాల మార్గదర్శకాలు తయారు చేస్తున్నారు.

- Advertisement -