వెస్టిండీస్ చిరస్మరణీయ విజయమందుకుంది. షై హోప్ (118 నాటౌట్) అజేయ శతకంతోపాటు బ్రాత్‌వైట్ (95) పోరాడడంతో ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో పర్యాటక వెస్టిండీస్ చారిత్రక విజయాన్ని సాధించింది.
322 పరుగుల లక్ష్యఛేదనలో.. టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో విండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడో టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమం చేసింది. చివరి టెస్ట్ వచ్చే నెల 7 నుంచి లార్డ్స్‌లో జరగనుంది.
5/0తో ఐదో రోజైన మంగళ వారం ఆటను ఆరంభించిన విండీస్.. ఓవర్‌నై ట్ బ్యాట్స్‌మన్ పావెల్ (23) వికెట్‌ను స్వల్ప స్కోరుకే కోల్పోయింది. వన్ డౌన్‌లో వచ్చిన కైల్ హోప్ పరుగులేమీ చేయకుండా రనౌట్‌గా వెనుదిరిగాడు.
ఈ దశలో బ్రాత్‌వైట్ కు జతకలసి షై హోప్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలసి మూడో వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో విండీస్ కోలుకుంది. హోప్ తుది వరకు నిలిచి విండీస్‌ను విజయ తీరాల కు చేర్చాడు. ఇంగ్లండ్ 258, 490/8 డిక్లేర్డ్, వెస్టిండీస్ 427, 322/5.