హ్యాపీ బర్త్ డే నాగ్….

793
nagarjuna birthday
- Advertisement -

ఆయన వయస్సు 60…అయినా అభిమానులకు, ప్రేక్షకులకు మాత్రం ఆయన ఎప్పటికీ యువసామ్రాట్టే. కొడుకులిద్దరూ సినిమాల్లో సత్తా చాటుతున్నారు. వాళ్లతో పోటీకీ ఆయన సిద్ధమే. మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి వంటి వరుస బ్లాక్‌బస్టర్‌లతో యంగ్‌ స్టార్‌ హీరోలకే పోటీనిచ్చారు. ఆయనే టాలీవుడ్ కింగ్‌ అక్కినేని నాగార్జున. నేడు ఆయన తన 60వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నాగ్ కు  గ్రేట్ తెలంగాణ.కామ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

1959 ఆగస్టు 29న అక్కినేని నాగేశ్వరరావు-అన్నపూర్ణ దంపతులకు జన్మించాడు నాగ్. అక్కినేని నటవారసుడిగా 1967లో సుడిగుండాలు చిత్రంతో తొలిసారి బాలనటుడిగా తెరకు పరిచయమయ్యాడు. విక్రమ్‌ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి… మజ్నుతో మంచి విజయాన్ని అందుకున్నాడు. సంకీర్తన మూవీతో బ్లాస్ బాస్టర్ రుచి చూశాడు. శివ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. గీతాంజలి లాంటి ప్రయోగాలు కూడా చేశాడు.

Happy birthday Nagarjuna
మాసూ క్లాసూ అనే లెక్కలకి అందని కథానాయకుడు. శివలా సైకిల్‌ చైన్‌ పట్టినా, డాన్‌గా గ్యాంగ్‌ను నడిపినా అభిమానులు ఫిదా అవ్వాల్సిందే. అంతేకాదు నేను నేనుగా లేనే.. అంటూ మన్మథుడి అవతారం ఎత్తి అమ్మాయిల్ని మాయ చేయగలడు. అదిగో అల్లదిగో శ్రీహరివాసము.. అంటూ అన్నమయ్యగా భక్తుల చేత దండాలు పెట్టించగలడు.

ఓ వైపు సినిమాల్లో రాణిస్తునే మరోవైపు బిజినెస్ రంగంలోనూ సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా ,ఊపిరి  నాగార్జునకు అంతులేని ఉత్సాహాన్ని ఇచ్చాయి.  సాంఘిక సినిమాల్లోనూ, పౌరాణిక పాత్రల్లోనూ నటించి మెప్పిస్తున్న నాగార్జున తన సినిమాలతో అలరించడమే కాదు రానున్న రోజులలో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని greattelangaana.com మనస్పూర్తిగా కోరుకుంటోంది.

- Advertisement -