అయిదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ – శ్రీలంకల మధ్య ఆదివారం మూడో వన్డే జరిగింది. ఈ వన్డేలో భారత్ గెలవడంతో పాటు 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మహేంద్ర సింగ్ ధోని మైదానంలో నిద్రపోయాడు. అయితే గ్రౌండ్ లో ధోని నిద్రపోవడానికి ఓ కారణం కూడా ఉంది. ఓవైపు తమ టీమ్ ఓడిపోతున్నదని శ్రీలంక అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. ఇదేం ఆట అంటూ ప్లేయర్స్‌పై బాటిల్స్ విసిరి నిరసన తెలుపుతున్నారు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.44వ ఓవర్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ సమయంలో రోహిత్ శర్మ 122, ధోని 61 పరుగులతో క్రీజులో ఉన్నారు.అప్పటికే బాగా అలసిపోయిన ధోని విరామం దొరకడంతో హెల్మెట్, గ్లౌజులు తొలగించి క్రీజులో బోర్లా పడుకుని విశ్రాంతి తీసుకున్నాడు. అప్పటి వరకు సీరియస్ గా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా ధోనీ కునుకుతో స్టేడియంలో నవ్వులు విరిశాయి. కామెంటేటర్లు కూడా జోకులు పేల్చారు. క్రికెట్ చరిత్రలో ఫస్ట్ టైం కావొచ్చు.. ఓ ఆటగాడు గ్రౌండ్ లో కునుకు తీయటం. ధోనీ క్లోజప్ చూస్తే కూడా స్పష్టంగా అర్ధం అవుతుంది.. కళ్లు మూసి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు ఉన్న ఫొటో, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"Only #Dhoni can have a nap in the middle of the ground during match" 😂#SLvIND #INDvSL pic.twitter.com/Nlh0WRXZun
— Shaun (@shauntweets7) August 27, 2017