బిగ్ బాస్ లో మహేష్ బాబు

280
Mahesh Babu In Bigg Boss House
- Advertisement -

అవును మీరు చదివింది నిజమే. మహేష్ బాబు బిగ్ బాస్ షోలో స్పెషల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అహా… అని అప్పుడే గెంతులు వేయకండి. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. మహేష్ వస్తోంది తెలుగు షోలో కాదు. కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్న తమిళ బిగ్ బాస్ లో.  “స్పైడర్” ద్వారా తమిళనాట ప్రిన్స్ మహేష్ బాబు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీన ఓ భారీ ఈవెంట్ ను పెట్టి మరీ, ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ చేతుల మీదుగా తమిళనాడుకు ప్రిన్స్ ను పరిచయం చేయాలని ఇప్పటికే దర్శకుడు మురుగదాస్ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే.

Mahesh Babu In Bigg Boss House

ఇదిలా ఉంటే, మహేష్ కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ ను కూడా ‘స్పైడర్’ కోసం వాడేయబోతున్నారని తెలుస్తోంది. తమిళంలో కమల్ నిర్వహిస్తున్న ‘బిగ్ బాస్’ షోలో ‘స్పైడర్’ పబ్లిసిటీ కార్యక్రమాలు ప్లాన్ చేసినట్లుగా లభించిన కీలక సమాచారం. ఎలాగైనా సరే స్పైడర్ మూవీతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయాలని చూస్తున్నాడు మహేష్. బ్రహ్మోత్సవం సినిమాతో అభిమానులను తీవ్ర నిరాశకు గిరిచేశాడు మహేష్. అయితే ఈ సారి అభిమానులకు మంచి సినిమాను అందించేందుకు భారీ ఎత్తున సిద్ధమౌతున్నాడు మహేష్. అందుకనే దాదాపు 125కోట్లతో మురుగుదాస్ డైరెక్షన్ లో స్పైడర్ సినిమాను తెరకెక్కించారు.

Mahesh Babu In Bigg Boss House

తమిళ్ లో ప్రిన్స్ కి చెప్పుకోదగ్గ మార్కెట్ లేదు. సెప్టెంబరు 9న ‘స్పైడర్’ స్పెషల్ ఈవెంట్ చెన్నైలో జరగబోతుండగా.. దాని కంటే ముందే మహేష్ ‘బిగ్ బాస్’లో పాల్గొనే అవకాశముంది. మనోడు పుట్టింది పెరిగింది చెన్నైలోనే కాబట్టి.. తమిళంలో మాట్లాడుతూ తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

- Advertisement -