యుద్దం శరణం.. ట్రైలర్‌

226
Naga chaitanya's Yuddham Sharanam Trailer
Naga chaitanya's Yuddham Sharanam Trailer
- Advertisement -

ఈ మధ్య కాలంలో తనకు డిఫరెంట్ సినిమాలు కలసి రావట్లేదని మనోడు చక్కగా రొమాంటిక్ కామెడీలూ చేస్తూ వచ్చాడు నాగ చైతన్య. అయితే ఇప్పుడు మాత్రం ”యుద్ధం శరణం” అనే థ్రిల్లర్ సినిమాతో దూసుకొస్తున్నాడు. గతంలో విడుదలైన ఈ సినిమా టీజర్ లో ”మనం బ్రతకాలంటే.. వాడికి ఎదురెళ్ళాలి. ఇది ధైర్యం కాదు. తెగింపు” అనే లైన్ తో సింగిల్ పాయింట్ లో కథేంటో చెప్పాశాడు చైతు. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌తో ‘పరిగెత్తే ప్రతివాడూ పారిపోతున్నట్లు కాదు’ అంటూ మరోసారి ముందుకు వచ్చాడు నాగచైతన్య.

ఆదివారం రాత్రి ఈ సినిమా ఆడియో వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. మన జీవితాలు ఆనందంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా అద్భుతంగానే అనిపిస్తుంది. అది మన ప్రపంచం. కానీ, ఆ జీవితాల్ని కుదిపేస్తూ ఒక కట్‌ త్రోట్‌ క్రిమినల్‌’ అంటూ చైతన్య చెప్పిన డైలాగులు చిత్రంపై ఆసక్తిని పెంచుతున్నాయి. మరి ఆ క్రిమినల్‌ ఎవరు? తల్లిదండ్రులు, తోబుట్టువులతో ఎప్పుడూ సంతోషంగా ఉండే ఓ యువకుడి కుటుంబంలో ఉన్నట్టుండి ఎదురైన ఆ సమస్య ఏంటి? అతన్ని జీవితాన్ని ఎలా తల్లకిందులు చేసింది. చివరకు కథానాయకుడు ఏం చేశాడు. తదితర అంశాల సమాహారమే ఈ ‘యుద్ధం శరణం’.

ఈ సినిమాలో విలన్‌గా శ్రీకాంత్‌ నటిస్తున్నాడు. వారాహి చలన చిత్ర పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 8న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కృష్ణ ఆర్‌.వి.మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించారు.

https://youtu.be/7m1-hz4jHpA

- Advertisement -