అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రం, పోర్ట్‌లాండ్ నగరంలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్(టి డిఫ్) పోర్ట్‌లాండ్ చాప్టర్ ఆధ్వర్యంలో వన భోజనాలు చాలా అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని చాప్టర్ చైర్ శ్రీని అనుమాండ్ల ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారికి నివాళులర్పించి ప్రారంభించారు.
ఈ వేడుకలకి పోర్ట్‌లాండ్ మెట్రో నగరాల నుండి పెద్దఎత్తున ఎన్నారైలు తరలివచ్చారు. ఈ సందర్భంగా టీడీఎఫ్ టీం ఉదయాన్నే పార్క్‌లో పలు రకాల తెలంగాణ రుచికరమైన వంటలు వండారు. ఈ సందర్భంగా టీడీఎఫ్ ఆధ్వర్యంలో పలు రకాల క్రీడలు నిర్వహించారు. వీటిలో ఫన్ గేమ్స్-వాలి బాల్, టగ్ ఆఫ్ వార్, బింగో, మ్యూజికల్ చైర్, బాల్ గేమ్‌లలో మహిళలు, పిల్లలు యువకులు, సినీయర్ మరియు యువ దంపతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చిన్నారుల్లు బౌన్సీ బంప్ మరియు స్వాండ్ గేమ్స్ ప్లే స్ట్రక్చర్‌తో చాలా ఆనందంగా గడిపారు.
ఈ వేడుకలు జరగటానికి సహాయం చేసిన స్పాన్సర్స్ అందరికి శ్రీని కృతజ్ఞతలు తెలియచేస్తూ జ్ఞాపికలు అందచేశారు. వేడుకలకు హాజరైనవారికి రాఫెల్డ్రా నిర్వహించి గెలుపొందినవారికి, ఫన్ గేమ్స్ మరియు ఆటల్లల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీని అనుమాండ్ల కార్యక్రమంలో పాల్గొన్న పోర్ట్‌లాండ్ ఎన్నారైలందరికి కృతజ్ఞతలు తెలియజేసారు. చివరగా ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి విశేషంగా కృషి చేసిన టిడిష్ పోర్ట్‌లాండ్ చాప్టర్ టీం సభ్యులందరికి అభినందనలు తెలియచేసారు.