వరుణ్ తేజ్ , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన మూవీ ఫిదా..ఎలాంటి సంచలన విజయం సాధించిందో తెలియంది కాదు..మొదటి రోజు యావరేజ్ అనే టాక్ వచ్చినప్పటికీ తర్వాత రోజునుండి సినిమా కలెక్షన్స్ ఎక్కడ డ్రాప్ కాకుండా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ముఖ్యం గా అమెరికాలో మిలియన్ మార్కు దాటుతుందా అన్న చర్చ మొదలైంది. కానీ ఆ సినిమా మిలియన్ మార్కు కాదు.. ఏకంగా 2 మిలియన్ మార్కును దాటేసి సంచలనం సృష్టించింది.
ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ సినిమా కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. వివాదాలతోనే భారీ పబ్లిసిటీ పొందిన ఈ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లోనూ అర్జున్ రెడ్డి సత్తా చాటుతున్నాడు. ఓవర్ సీస్ లో పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరక్కపోయినా.. మంచి టాక్ రావటంతో వసూళ్లు భారీగా ఉన్నాయి. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికాలో సైతం కళ్లుచెదిరే వసూళ్లు రాబడుతోంది.ప్రిమియర్లతోనే 2 లక్షల డాలర్ల దాకా వసూలు చేసిన ఈ సినిమా.. శుక్రవారం కూడా దుమ్ముదులిపింది.
తొలి రోజు ముగిసే సమయానికే 4 లక్షల మార్కును దాటేసిన ఈ సినిమా వీకెండ్ అయ్యేసరికే మిలియన్ మార్కును టచ్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లతో దూసుకుపోతున్న అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండకు జోడిగా షాలిని పాండే నటించింది.