మాఫియా బాస్ గా శర్వానంద్..!

225
saravanand
- Advertisement -

శతమానం భవతి , రాధా చిత్రాలతో అలరించిన శర్వానంద్ , తాజాగా మారుతీ దర్శకత్వం లో మహానుభావుడు చిత్రం తో వస్తున్నాడు. ఇదిలా ఉంటె స్వామిరారా, దోచేయ్, కేశవా చిత్రాలతో సక్సెస్ లు అందుకున్న సుధీర్ వర్మ తాజాగా శర్వానంద్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. హారిక హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించే ఈ మూవీలో శర్వానంద్ మాఫియా లీడర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది.

ఈ సినిమాలో కూడా హీరో ఓ సామాన్యుడి నుంచి మాఫియా లీడర్ గా ఎలా ఎదిగాడన్న లైన్ ఆధారంగా వుంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ కొంతసేపు నలభై ఏళ్ల వయసున్న మాఫియా లీడర్ గా కనిపిస్తాడని తెలుస్తోంది.   ఈ సినిమాకు సంబదించిన వివరాలు త్వరలోనే బయటకు రానున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -