మూడో రోజు కివీస్‌ బౌలర్లకు ముచ్చెమటలు

210
kwis
kwis
- Advertisement -

కాన్పూర్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 500వ టెస్టులో భారత జట్టు పట్టు బిగించింది. కివీస్‌ను 262కు ఆలౌట్ చేసిన టీమిండియా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి స్కోరు 47 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 159 పరుగులు చేసింది.

kiwisq

తొలి ఇన్నింగ్స్ లో 56 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతూ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (38) త్వరగానే అవుట్ అయినప్పటికీ, వన్ డౌన్ లో వచ్చిన పుజారా, మరో ఓపెనర్ మురళీ విజయ్ తో కలసి మూడవ రోజు ఆట ముగిసే వరకూ మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు ఆటగాళ్లూ హాఫ్ సెంచరీలను పూర్తి చేసుకున్నారు. మురళీ విజయ్ 62, పుజారా 50 పరుగుల వద్దా ఆడుతున్నారు. రాహుల్ వికెట్ సోధీకి లభించింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. నాలుగో రోజులో సాధ్యమైనంత ఎక్కువ పరుగులు చేసి, టీ విరామానికి ముందు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి న్యూజిలాండ్ ను రెండో ఇన్నింగ్స్ బరిలోకి దించాలన్నది భారత ఆలోచనగా తెలుస్తోంది.

- Advertisement -