అక్రమ కట్టడాలను కూల్చేస్తాం…

235
- Advertisement -

రాష్ట్రానికి భారీ వర్షాలు రావటం చాలా సంతోషంగా ఉందని…అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయని సీఎం కేసీఆర్ అన్నారు. వరద పరిస్థితిపై రివ్యూ నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం ఆగస్టులో పెద్దగా వర్షాలు రాకున్న సెప్టెంబర్‌లో భారీగా వర్షాలు రావటంతో అన్ని మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఓవర్‌ ఫ్లో అవుతున్నాయని తెలిపారు.ఎస్సారెస్పీ,సింగూరు నిండుకున్నాయని తెలిపారు.

ఒక్క నాగార్జున సాగర్‌ తప్ప మిగితా ప్రాజెక్టుల్లో భారీగా నీరువచ్చిందని తెలిపారు. 46 వేల చెరువులకు గాను 25 వేలకు పై చిలుకు చెరువులు మత్తడి పోస్తున్నాయని…మిగితా చెరువులు నిండాయని అన్నాయి. మిషన్ కాకతీయ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర రైతాంగం ఆనందంలో ఉందని…రెండు సంవత్సరాల వరకు కరువు తెలంగాణ దరి చెరదని స్పష్టం చేశారు. అక్రమకట్టడాల కూల్చివేతకు ప్రజలు,ప్రతిపక్షాలు సహకరించాలని కేసీఆర్ కోరారు.

ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని…ఆర్మీ సహకారం కూడా తీసుకుంటున్నామని తెలిపారు. వరంగల్‌లో లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరిందని…అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. హైదరాబాద్‌కు ఈ దుస్థితి వస్తుందని తాను ఎప్పుడో చెప్పానని కేసీఆర్ గుర్తుచేశారు. చెన్నైతో పొలిస్తే హైదరాబాద్‌కు జరిగిన నష్టం చాలా తక్కువన్నారు. హైదరాబాద్‌లో వేల సంఖ్యలో అక్రమకట్టడాలున్నాయని తెలిపారు. పాతభవనాలకు కూల్చడం వల్లే ప్రాణ నష్టం తప్పిందని…అందులో ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయని తెలిపారు. విశ్వనగరం రాత్రికి రాత్రే రాదని…ఎగతాళి చేయడం వారి అవివేకానికి నిదర్శనమని తెలిపారు.గత పాలకులు చేసిన తప్పదిదాలకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నామని మండిపడ్డారు. హైదరాబాద్‌లో అక్రమకట్టడాలకు అనుమతివ్వమని…ఎవరైనా కడితే నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తామని స్పష్టం చేశారు.

స్వల్పంగా నష్టం జరిగిందని..కొన్ని చోట్ల పంటలు నాశనమయ్యాయని తెలిపారు. సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండిందని…రేపు ఉదయం కల్లా నిజాం సాగర్ నిండుతుందన్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అధికారులకు సెలవు మంజూరు చేయమని తెలిపారు. ప్రజాప్రతినిధులందరు వారి నియోజకవర్గాల్లో వరద పరిస్థితిపై మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. కరెంట్ సమస్య రాకుండా చూశామని తెలిపారు. ఢిల్లీ నుంచే తాను వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశానని తెలిపారు.మరో 15 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

శ్రీశైలం గేట్లు ఎత్తితే నాగార్జున సాగర్ నిండుతుందని తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఏలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొంటామని తెలిపారు.1908 తర్వాత హైదరాబాద్‌లో అత్యధిక వర్షాపాతం నమోదైందని తెలిపారు. నగరంలో 380 మీమీ వర్షం కురిసిందని తెలిపారు. హైదరాబాద్ ప్రజాప్రతినిధులను అభినందిస్తున్నానని తెలిపారు. మీడియా కొంత అతిగా చూపెడుతుందని అది మానుకోవాలని కేసీఆర్ హితవు పలికారు.శక్తికి మించి వర్షం వచ్చినప్పుడు కొంత ఇబ్బందులు తప్పవన్నారు.

హైదరాబాద్‌ అభివృద్ధి కోసమే 20 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని.. కేంద్రం సాయం కోరుతామని తెలిపారు.అక్రమ కట్టడాల కూల్చివేతకు 24 ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు వేశామని…అక్రమకట్టడాల వివరాలు వెల్లడించిన వారికి 10 వేల బహుమతిని అందజేస్తామని తెలిపారు.

- Advertisement -